Peddapalli: పెద్దపల్లిలో మహనీయుల జయంతి జాతర.. ఉత్సవ కమిటీ భారీ స్కెచ్!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఉత్సవాల కమిటీ చైర్మన్ అంబాల రాజేందర్ కోరారు.
Peddapalli: పెద్దపల్లిలో మహనీయుల జయంతి జాతర.. ఉత్సవ కమిటీ భారీ స్కెచ్!
Peddapalli: మహనీయుల జయంతోత్సవాలను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ఉత్సవాల కమిటీ చైర్మన్ అంబాల రాజేందర్ అన్నారు.పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పెద్దపల్లి జిల్లా ఉత్సవాల కమిటీ చైర్మన్ అంబాల రాజేందర్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 14న డా. బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పండు గలా ఘనంగా నిర్వహించుకుందామని పెద్దపల్లి జిల్లా జయంతోత్సవాలు వైభవంగా మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ , రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ కుల, మతాలకు అతీతంగా పెద్దసంఖ్యలో హాజ రై విజయవంతం చేయాలన్నారు. కమాన్ చౌరస్తా నుంచి కోలాటం, దప్పు సప్పుడులతో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహల వరకు భారీ ర్యాలీ నిర్వ హిస్తున్నామని తెలిపారు. ప్రతి పల్లె నుంచి ఆయా రోజుల్లో జిల్లా కేంద్రం లో నిర్వహించే వేడుకల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై, ఘన నివాళి
అర్పించాలని కోరారు. వివిధ ప్రజాసంఘాల నేతలు, సర్పంచ్ లు, కౌన్సి లర్లు, కార్పొరేటర్న్, వివిధ రాజకీయ పార్టీల నేతలు హజరై వారిని సర్మిం చుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయర మణరావు, మంత్రులు అల్లూరి లక్ష్మణ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు సైతం హా జరు కావాలని జయంతోత్సవ కమిటీ తరుపున ఆహ్వానిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డా.బిఆర్ అంబేడ్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మెన్ మామిడిపల్లి బాపయ్య బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ చైర్మెన్ అంబాల రాజేందర్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందo,పాల రాజేశం,కుక్క అశోక్, బొంకూరి నరేందర్, కుక్క శ్రావణ్, తదితరులు ఉన్నారు.




