Peddapalli: రైతులకు కలెక్టర్ బంపర్ ఆఫర్!

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 3:09 PM IST
Peddapalli
X

Peddapalli: రైతులకు కలెక్టర్ బంపర్ ఆఫర్!

Peddapalli: బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలం బొంత కుంట పల్లి గ్రామంలో పర్యటించారు. బొంత కుంట పల్లి గ్రామంలోని ఆయిల్ ఫామ్ తోటలను, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట విస్తరణకు తగిన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, బోంతకుంటపల్లి గ్రామంలో 30 ఎకరాలలో సాగు అవుతున్న ఆయిల్ పామ్, 4 ఎకరాలలో కోకో పంటలను పరిశీలించి క్రాప్ ఎప్పటి వరకు వస్తుందో ఆరా తీశారు. ఆయిల్ పామ్ తోటలో కోకో అంతర్ పంట సాగు చేసుకోవచ్చని తెలిపారు. సుల్తానాబాద్ మండలంలో 350 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.

రాబోయే జూన్ నెల నుంచి కొన్ని చోట్ల ఆయిల్ పామ్ పంట కోతలు ప్రారంభమవుతాయని అన్నారు. మండలంలో ఆయిల్ ఫామ్ సాగు మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ పామ్ తోటలలో నరేగా క్రింద గడ్డి తొలగింపు చేర్చితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు కలెక్టర్ ను కోరారు.

ఆయిల్ పామ్ పంట సంబంధించి అధికారులు కంపెనీ ప్రతినిధుల నుంచి ఎప్పటికప్పుడు సూచనలు అందుతున్నాయని రైతులు తెలిపారు. పంట పురోగతి పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు వచ్చే ఆదాయం గురించి విస్తృతంగా ప్రచారం చేసి మరింత వేగంగా పంట విస్తరణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి నిధులు ప్రభుత్వం రెగ్యులర్ గా విడుదల చేస్తుందని తెలిపారు. బొంతకుంటపల్లి గ్రామంలో ఆసరి రమ్య అనే లబ్ధిదారులు కడుతున్న ఇంటికి ఇప్పటివరకు ప్రభుత్వం 3,40,000 విడుదల చేసిందని, ఇంటి నిర్మాణం పనులు పూర్తిచేస్తే మిగిలిన డబ్బులు విడుదల అవుతాయని, 15 రోజుల వ్యవధిలో పెండింగ్ పనులు పూర్తి చేయాల్సి ఫైనల్ బిల్లు సబ్మిట్ చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా హార్టికల్చర్ సెరికల్చర్ అధికారి జగన్ మోహన్ రెడ్డి, ఎం.పి.డి.ఓ దివ్య దర్శన్ రావు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story