Boduppal: చదువుల పేరుతో దోపిడీ? బోడుప్పల్ స్కూల్ వద్ద ఉద్రిక్తత!

Boduppal: మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద ఫీజుల పెంపుపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 March 2026 11:37 AM IST
Boduppal
X

Boduppal: చదువుల పేరుతో దోపిడీ? బోడుప్పల్ స్కూల్ వద్ద ఉద్రిక్తత!

మేడ్చల్ జిల్లా: బోడుప్పల్‌లోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అడ్మిషన్ సమయంలో స్కూల్ యాజమాన్యం తెలిపిన ప్రకారం ప్రతి ఏడాది 5 శాతం ఫీజుల పెంచాల్సి ఉండగా.. అంతకు మించి 20 శాతం స్కూల్ ఫీజులు పెంచడం పట్ల విద్యార్థుల పేరెంట్స్ నిరసనకు దిగారు. ఫీజు చెల్లించే సమయంలో ఒక్కరోజు ఆలస్యమైనా 3 వేలు పెనాల్టీ వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. 20శాతం అదనపు ఫీజులు, పెనాల్టీ వేయడంతో పేరెంట్స్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. యాజమాన్యం దిగి వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోలన కొనసాగిస్తామంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story