Karimnagar: తోట సత్యం ఉదారత.. బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా!
Karimnagar: కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన పాల్లటి మల్లమ్మ మృతి చెందడంతో, ఎన్ఆర్ఐ తోట సత్యం గారు ఆ కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు.
Karimnagar: తోట సత్యం ఉదారత.. బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా!
కరీంనగర్ జిల్లా: రామడుగు మండల కేంద్రానికి చెందిన పాల్లటి మల్లమ్మ మృతి చెందారు ఈ విషయాన్ని, కర్ణ శ్రీనివాస్, NRI తోట సత్యం కు సమాచారం అందించగా వెంటనే స్పందించి, మల్లమ్మ కుమారుడు పాల్లటి అంజయ్య కు ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంలో, కుల పెద్దలు జవ్వాజి లక్ష్మణ్, జవ్వాజి హనుమంతు మరియు పరుపటి పోచమల్లు చేతుల మీదుగా 10,000 రూపాయలు సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాల్లటి కుటుంబ సభ్యులు NRI తోట సత్యం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామస్తుల సమాచారం ప్రకారం, NRI తోట సత్యం సహకారంతో ప్రతి సంక్షోభ సమయంలో సానుకూలంగా స్పందిస్తూ, గ్రామీణుల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నారని, ఈ సాయం ద్వారా కూడా ఆయన మానవత్వానికి ఉన్న ప్రత్యేక గుర్తింపుని మరోసారి గుర్తుచేశారు.
ఈ సంఘటన గ్రామ సమాజంలో మానవత్వం, సానుకూలత మరియు సామాజిక బాధ్యతల గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఈ సహాయం ద్వారా బాధిత కుటుంబానికి ఆదరణ లభించడంతో, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.




