Telangana: పెట్రోల్ టెన్షన్ వద్దు.. స్టాక్ ఫుల్: పౌరసరఫరాల శాఖ

No Fuel Shortage in Telangana: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

Arun Chilukuri
Published on: 25 March 2026 11:21 AM IST
Telangana: పెట్రోల్ టెన్షన్ వద్దు.. స్టాక్ ఫుల్: పౌరసరఫరాల శాఖ
X

 Telangana: పెట్రోల్ టెన్షన్ వద్దు.. స్టాక్ ఫుల్: పౌరసరఫరాల శాఖ

No Fuel Shortage in Telangana: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కట్టారు. ఈ రద్దీపై స్పందించిన అధికారులు.. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు.

నిల్వలు పుష్కలంగా ఉన్నాయి

‘‘రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోంది. ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కేవలం వదంతుల వల్లే ఫిల్లింగ్‌ స్టేషన్ల వద్ద అనవసర రద్దీ నెలకొంది. ప్రజలు ఆందోళనతో ఒక్కసారిగా బంకులకు రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు’’ అని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.

డీలర్ల అసోసియేషన్ భరోసా

మరోవైపు తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్‌ కూడా ఇంధన లభ్యతపై ప్రకటన విడుదల చేసింది. HPCL, IOCL, BPCL కంపెనీల వద్ద తగినంత స్టాక్‌ ఉంది. ముందస్తు కొనుగోళ్ల (Panic Buying) వల్లే తాత్కాలికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అన్ని బంకులకు సరఫరా యథావిధిగా కొనసాగుతోంది.

నేడు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమీక్ష

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. నేడు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో అధికారులతో సీఎం కీలక సమీక్ష నిర్వహించనున్నారు.పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా స్థితిగతులు. గ్యాస్ సిలిండర్ల లభ్యత. రాష్ట్రంలో యూరియా నిల్వలు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story