Peddapalli: అనారోగ్యంతో జీవితంపై విరక్తి.. చెరువులో పడి వృద్ధురాలి ఆత్మహత్య
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో శనిగరపు మదనమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్య సమస్యలతో నీలకంఠ చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది.
Peddapalli: అనారోగ్యంతో జీవితంపై విరక్తి.. చెరువులో పడి వృద్ధురాలి ఆత్మహత్య
Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని నీలకంఠ చెరువులో శుక్రవారం ఉదయం ఒక వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన శనిగరపు మదనమ్మ (80) అనే వృద్ధురాలు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.
గురువారం సాయంత్రం వృద్ధురాలు మదనమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె, తిరిగి రాలేదు.కుటుంబ సభ్యులు గాలించగా, శుక్రవారం సమయంలో స్థానిక నీలకంఠ చెరువులో మదనమ్మ శవమై కనిపించింది. అనారోగ్య సమస్యలు, వయోభారం కారణంగా జీవితంపై విరక్తి చెంది మధునమ్మ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




