Nalgonda: రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం సేకరణకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్
Nalgonda: నల్గొండ జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభం. 126 కేంద్రాల ద్వారా సేకరణ.
Nalgonda: రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం సేకరణకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్
Nalgonda: జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియ ఊపందుకుంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 126 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు రూ. 1.42 కోట్ల విలువైన 595 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు.ఐకేపీ కేంద్రాలు: 48,750 టన్నుల దొడ్డు ధాన్యం.
పీఏసీఎస్ కేంద్రాలు: 89,705 టన్నుల దొడ్డు, 1,480 టన్నుల సన్న ధాన్యం. రైతు ఉత్పత్తి కేంద్రాలు: 180 టన్నుల సన్న రకం. మొత్తంగా 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరుకోగా, ప్రాథమికంగా 63 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సజావుగా సేకరణ సాగేందుకు ఇప్పటికే 8.65 లక్షల గన్నీ బ్యాగులను పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు.


