Nagar Kurnool: ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఏమ్మెల్యే రాజేష్ రెడ్డి
Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 6వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
Nagar Kurnool: ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఏమ్మెల్యే రాజేష్ రెడ్డి
Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక శాసనసభ్యులు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం అదే వార్డులో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మెరుగైన నివాస సౌకర్యాలు, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు శ్రీనివాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.
Next Story




