Moinabad Farmhouse Drug Case: నేటితో ముగిసిన రోహిత్, రితేశ్ రెడ్డిల కస్టడీ.. బెయిలా? జైలా?

Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 13 April 2026 12:15 PM IST
Moinabad Farmhouse Drug Case
X

Moinabad Farmhouse Drug Case: నేటితో ముగిసిన రోహిత్, రితేశ్ రెడ్డిల కస్టడీ.. బెయిలా? జైలా?

Moinabad Farmhouse Drug Case: రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసులో సిట్‌ (SIT) విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, రితేశ్‌ రెడ్డిల కస్టడీ గడువు నేటితో ముగిసింది. దీంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు సర్వం సిద్ధం చేశారు.

ఇప్పటికే నిందితులను నాలుగు సార్లు కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు, సుదీర్ఘ విచారణలో పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులు, ఆర్థిక లావాదేవీల కోణంలో విచారణ సాగినట్లు సమాచారం.

విచారణ ఇంకా పూర్తి కాలేదని, మరికొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంటూ నిందితులను మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

మరోవైపు, తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తమపై మోపిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని వారు వాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కోర్టు పోలీసుల కస్టడీ పిటిషన్‌ను ఆమోదిస్తుందా? లేక నిందితులకు బెయిల్ లభిస్తుందా? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు కోర్టు ఇచ్చే తీర్పు ఈ కేసులో అత్యంత కీలకం కానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story