MLA Raja Singh: స్కూల్లో 'కల్మా' హోంవర్క్ చిచ్చు.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే రాజాసింగ్!

MLA Raja Singh: తెలంగాణలోని ఒక ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు 'కల్మా' హోంవర్క్‌గా ఇవ్వడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 16 July 2026 12:41 PM IST
MLA Raja Singh
X

MLA Raja Singh: స్కూల్లో 'కల్మా' హోంవర్క్ చిచ్చు.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే రాజాసింగ్!

MLA Raja Singh: తెలంగాణలో ఒక ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు 'కల్మా' హోంవర్క్‌గా ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదాస్పద ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులకు ఇలాంటి హోంవర్క్‌లు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ ఘటనపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్.. కొన్ని శక్తులు ఉగ్రవాద ఆలోచనలతోనే స్కూళ్ళు, కాలేజీలు, మాల్స్, అలాగే హిందూ సముదాయాలపై ఈ విధంగా దాడులు, ప్రయోగాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. "అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది?" అంటూ ఆయన అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో ఇలాంటి మతపరమైన రుద్దుడు ఏంటని నిలదీశారు.

ఈ వివాదానికి కారణమైన సదరు పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి, ఆ స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story