Jammikunta: జమ్మికుంటలో క్రికెట్ సందడి: ముగిసిన జెపీఎల్ టోర్నీ
Jammikunta: జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో జెపీఎల్ సీజన్-3 క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది.
Jammikunta: జమ్మికుంటలో క్రికెట్ సందడి: ముగిసిన జెపీఎల్ టోర్నీ
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో జమ్మికుంట ప్రీమియం లీగ్ (JPL) విజేతలకు మొదటి బహుమతి DLS మరియు రెండవ బహుమతి Stake 11 టీమ్ లకు స్థానిక శాసన సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి బహుమతి అందించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ JPL నిర్వాహకులు మరియు క్రీడాకారులను ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని,
క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని తెలుపుతూ గెలుపు, ఓటములు సహజం ఏవైనా రెండు జట్లు తలపడినపుడు ఒకరు ఓడిపోవడం ఒకరు గెలవడం సహజంఓడిపోయిన వారు మరోసారి గెలుపు కోసం ప్రయత్నించాలి ఆటను అటలాగే చూడాలి తప్ప వ్యక్తిగతంగా తీసుకోకూడదు అని తెలుపుతూ,
ప్రస్తుత యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా ప్రస్తుత పరిస్థితులలో తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని క్రీడల పట్ల శ్రద్ధ చూపించి ఏదో ఒక క్రీడా పై నైపుణ్యత సాధించాలని తమను కన్నా తల్లిదండ్రులపై గౌరవం చూపించాలని తెలుపుతూ ఇలాంటి టోర్నమెంట్లు స్థానిక ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్ చింతల శ్రీనివాస్, వెంకటేష్, సత్యం క్రీడాభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




