Obulapur: ఒబులాపూర్‌లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శ్రీకారం

Obulapur: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఒబులాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 5:29 PM IST
Obulapur
X

Obulapur: ఒబులాపూర్‌లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శ్రీకారం

Obulapur: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఒబులాపూర్ గ్రామంలో. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో భాగంగా ప్రతి గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

గ్రామపంచాయతీ భవనం నిర్మాణం ద్వారా ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story