Lingarajpally: గ్రామాభివృద్ధే లక్ష్యం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Lingarajpally: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లింగరాజ్ పల్లి గ్రామంలో పర్యటించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 April 2026 12:20 PM IST
Lingarajpally
X

Lingarajpally: గ్రామాభివృద్ధే లక్ష్యం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Lingarajpally: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని లింగరాజ్ పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పరిశీలించారు. గ్రామ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉంటాం అని తెలిపారు.

గ్రామంలో పెండింగ్‌లో ఉన్న గ్రామపంచాయతీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అలాగే మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సంఘ భవనాన్ని త్వరలోనే నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరించడమే తమ సంకల్పమని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల అధ్యక్షుడు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story