Karimnagar: అల్లు అర్జున్ అభిమానుల సామాజిక సేవ

Karimnagar: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన నివాసంలో HPV వ్యాక్సిన్ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 10:00 PM IST
Karimnagar
X

Karimnagar: అల్లు అర్జున్ అభిమానుల సామాజిక సేవ

కరీంనగర్: 14 ఏళ్లు నిండిన బాలికలు HPV వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వారికి గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉంటుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తమ్మన వేణి అంజి యాదవ్ ఆధ్వర్యంలో..HPV వాక్సిన్ ఉపయోగం తెలుపుతూ.. రూపొందించిన పోస్టర్ ను నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో వారి చేతులమీదుగా ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా అంజి యాదవ్ ఎమ్మెల్యే గంగులను సన్మానించారు. పుష్ప గుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఇలాంటి మంచి ప్రచారం కల్పిస్తున్న అల్లు అర్జున్ కు వారి అభిమానులకు అభినందనలు తెలియచేశారు. మున్ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాల్వ మల్లేశం, సింగిల్ విండో మాజీ చైర్మన్ సింగిరెడ్డి సోమిరెడ్డి, ఎనిమిదో డివిజన్ అధ్యక్షులు సల్ల మహేందర్, మిడిదొడ్డి నవీన్ కుమార్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి,బుర్ర చంద్రమౌళి, లంక రవి, ఉదయ్, దొగ్గలి అంజి, చందు, రఘు, రంజిత్, తరుణ్, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story