Choppadandi: భక్తిశ్రద్ధలతో విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం

Choppadandi: జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో శ్రీ లోకమాత పోచమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 12 April 2026 5:34 PM IST
Choppadandi
X

Choppadandi: భక్తిశ్రద్ధలతో విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం

Choppadandi: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో గ్రామ ఇలవేల్పు శ్రీ లోకమాత పోచమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గ్రామ దేవతల పూజలు మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాలలో ఐక్యతను పెంపొందించడంతో పాటు సామాజిక బంధాలను మరింత బలపరుస్తాయని అన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల హర్షధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story