Vikarabad: ఆధార్ మ్యాజిక్.. 12 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన తమ్ముడు!
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో అద్భుతం జరిగింది. 12 ఏళ్ల క్రితం తప్పిపోయిన రాజు అనే యువకుడు ఆధార్ కార్డు కారణంగా మళ్లీ తన కుటుంబ సభ్యులను చేరుకున్నాడు.
Vikarabad: ఆధార్ మ్యాజిక్.. 12 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన తమ్ముడు!
Vikarabad: 14 ఏళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు 26 ఏళ్ల వయసు వచ్చినప్పుడు స్వంతింటికి చేరాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మాణిక్య నగర్ కు చెందిన పరిగి నరసప్ప పెంటమ్మ దంపతుల చిన్న కుమారుడు రాజుకు మతిస్థిమితం సరిగా ఉండకపోవడంతో ప్రతిరోజు తన తండ్రి తాండూర్ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించే చెప్పులు కుట్టే దుకాణానికి వచ్చేవాడు 2013 సెప్టెంబర్ లో రాజుకు ఆధార్ కార్డు తీసుకున్నారు 2014 జూలైలో ఓ రోజు తండ్రితో కలిసి వచ్చిన రాజు హైదరాబాద్ రైలు ఎక్కి తప్పిపోయాడు హైదరాబాద్కు చేరుకున్నాక రైల్వే పోలీసులు అతనిని గుర్తించి సైదాబాద్ బాలల హోమ్ కు తరలించారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న అతడిని అక్కడే ఉంచారు ఐదేళ్ల కిందట మెదక్ జిల్లా సోంపేట మండలంలోని మగ్గంపూర్ బేతని సంరక్షణ ఆశ్రమంలో చేర్పించారు.
రాజుకు ఆధార్ కార్డును ఇప్పించేందుకు గత మార్చిలో ఆశ్రమ నిర్వాహకులు హైదరాబాద్ మాదాపూర్ లోని ప్రధాన ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లారు అక్కడ రాజుకు సంబంధించిన వివరాలు నమోదు చేసి కొత్త ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేశారు అది కాస్త అతని సొంత చిరునామాకు వెళ్ళింది దానిని చూసిన రాజు సోదరుడు బుగ్గప్ప ఆధార్ కార్డు పై ఉన్న ఆశ్రమం మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసి ఆరా తీశాడు తన తమ్ముడు అక్కడే ఉన్నాడని తెలుసుకొని సంతోషపడ్డాడు శనివారం ఆశ్రమానికి వచ్చి అన్ని ఆధారాలు చూపించి రాజును తమ వెంట తీసుకెళ్లాడు ఐదు సంవత్సరాలుగా తమ్ముడిని సంరక్షించిన ఆశ్రమ నిర్వాహకులకు సాజీవర్గీస్ కు కృతజ్ఞతలు తెలిపారు.




