Karimnagar: హామీలు నెరవేర్చడంలో వైపల్యం చెందిన ప్రభుత్వం
Karimnagar: కరీంనగర్ జాగృతిలో భారీ చేరికలు జరిగాయి. మైనారిటీ నేత అసియా సుల్తానా, బిఎస్పీ నేత గోష్కి కుమార్ జాగృతిలో చేరగా, జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.
Karimnagar: హామీలు నెరవేర్చడంలో వైపల్యం చెందిన ప్రభుత్వం
కరీంనగర్: కరీంనగర్ జాగృతి కార్యాలయంలో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో నగరానికి చెందిన మైనారిటీ మహిళ నాయకురాలు అసియా సుల్తానా. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు గోష్కి కుమార్ తెలంగాణ జాగృతిలొ చేరారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువాలు కప్పి జాగృతిలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యకు పరిష్కారం చూపలేదని ఈ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంగా ఓట్లు వేసిన వారందరినీ ఇప్పుడు గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎమ్మెల్సీలు కేవలం డబ్బుల సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్నారని అన్నారు.
ఇచ్చిన హామి ప్రకారం వృద్ధులకు రూ.4000 లు పెన్షన్లు ఎప్పుడూ ఇస్తావు. ప్రతి జిల్లా కేంద్రంలో వృద్దుల కోసం నువ్వు కట్టి ఇస్తా అని చెప్పిన ఓల్డ్ ఏజ్ హెూమ్స్ ఏం అయినాయి. అలగే తెలంగాణ అమరవీరుల కుటుంబానికి 25,000 పెన్షన్ ఎటుపోయింది, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మరియు ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఎక్కడ ఇచ్చారు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వానికి పట్టినగతే ఈ ప్రభుత్వానికి పడుతుంది..
ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న DAలను ఎప్పుడూ చెల్లిస్తావు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు. IKP ఉద్యోగులకు వేతనాలకు పెంచాలేదు వారికి ఉద్యోగ భద్రత అనే హామిని తుంగలో తోక్కారు. అదేవిధంగా ఇప్పుడు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కూడ దీక్షలు, రాస్తారోకోలు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. వారికి పదవీ విరమణ తరువాత రావలసిన బకాయిలు అందక గత 24 నెలల నుండి వారు అనేకసార్లు ఈ ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలను తీసుకుపోయిన ఇప్పటికీ స్పందన లేదు.
2024 మార్చి నుండి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రిటైర్మెంట్ అయిన 24,678 మంది ఉద్యోగులకు రావలసిన బకాయిలు అందక వారు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 250 మంది పెన్షనర్లు చనిపోయిన వారిమీద ఈ ప్రభుత్వానికి కనీసం జాలికలగడం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి లేని ఎడల తెలంగాణ జాగృతి ఈ ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిరసనగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జాగృతి జిల్లా అధ్యక్షుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జాగృతి సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, అదివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, జాగృతి మహిళ విభాగం నాయకురాలు జంగ అపర్ణ, కుతాడి రజిత తదితరులు పాల్గొన్నారు.




