KTR: కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ కారుకు తప్పిన ప్రమాదం

KTR: కరీంనగర్ జిల్లా అల్గునూర్ వద్ద కేటీఆర్ కారుకు తృటిలో ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 5 Sept 2026 11:55 AM IST
KTR
X

KTR: కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ కారుకు తప్పిన ప్రమాదం

KTR: కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయాణిస్తున్న కారుకు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. అల్గునూర్ వద్ద రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా లారీకి కేటీఆర్ కారు డోర్ తాకింది. ఈ అకస్మాత్తు ప్రమాదంలో అప్రమత్తమైన కేటీఆర్ కారు డ్రైవర్ తక్షణమే స్పందించి కారును అదుపులోకి తీసుకున్నారు.

ఈ అనూహ్య ఘటనలో కేటీఆర్ కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story