HMTV: ప్రారంభమైన హెచ్ఎంటీవీ ఆర్గానిక్ మేళా: జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రులు!

HMTV: హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఆర్గానిక్ మేళాను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ప్రారంభించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 29 May 2026 12:26 PM IST
HMTV
X

HMTV: ప్రారంభమైన హెచ్ఎంటీవీ ఆర్గానిక్ మేళా: జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రులు!

HMTV: హెచ్ఎంటీవీ (HMTV) ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మెగా ఆర్గానిక్ మేళా' వైభవంగా ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఈ మేళాకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.

దాదాపు 200 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ ఆర్గానిక్ మేళాలో సేంద్రియ పద్ధతుల్లో పండించిన వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. రైతులు నేరుగా తమ ఉత్పత్తులను వినియోగదారులకు అందించేందుకు హెచ్ఎంటీవీ కల్పించిన ఈ వేదికపై పలువురు ఆసక్తిగా సందడి చేస్తున్నారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు మేళాలోని వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగర వాసులు అధిక సంఖ్యలో తరలివస్తుండటంతో మేళా ప్రాంగణం సందడిగా మారింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story