Vakiti Srihari: అసెంబ్లీ ఆవరణలో విషాదం.. కుప్పకూలిన ఐఏఎస్ పీఎస్‌కు సీపీఆర్ చేసిన మంత్రి శ్రీహరి

Vakiti Srihari: అసెంబ్లీ ఆవరణలో ఐఏఎస్ అధికారి పీఎస్ రాజు గుండెపోటుతో మృతి చెందారు.

Arun Chilukuri
Published on: 8 Sept 2026 12:09 PM IST
Vakiti Srihari
X

Vakiti Srihari: అసెంబ్లీ ఆవరణలో విషాదం.. కుప్పకూలిన ఐఏఎస్ పీఎస్‌కు సీపీఆర్ చేసిన మంత్రి శ్రీహరి

Vakiti Srihari: హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఆవరణలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి నవీన్ మిత్తల్ పర్సనల్ సెక్రటరీ (పీఎస్) రాజు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ అనూహ్య పరిణామాన్ని గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించారు. వెంటనే రాజు వద్దకు చేరుకుని ఆయనకు సీపీఆర్ (CPR) చేసి ప్రథమ చికిత్స అందించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

అనంతరం వెంటనే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి, బాధితుడిని అంబులెన్స్‌లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అయితే, రాజును ఆసుపత్రికి చేర్చేసరికే పల్స్ పూర్తిగా పడిపోవడంతో ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంత్రి శ్రీహరి తన వంతు ప్రయత్నంగా ప్రాణాలు నిలపడానికి చేసిన యత్నం అక్కడివారిని కలచివేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story