Wanaparthy: వనపర్తిలో మంత్రి శ్రీహరి సందడి.. అభివృద్ధి పనులకు శ్రీకారం

Wanaparthy: వనపర్తి పట్టణంలోని పీర్లగుట్టలో ఎంపీ లాడ్స్ నిధులు రూ. 1.20 కోట్లతో నిర్మించిన ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ భవనాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 April 2026 2:29 PM IST
Wanaparthy
X

Wanaparthy: వనపర్తిలో మంత్రి శ్రీహరి సందడి.. అభివృద్ధి పనులకు శ్రీకారం

Wanaparthy: వనపర్తి లో రూ. 1.20 కోట్లతో ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

బుధవారం వనపర్తి పట్టణంలోని పీర్లగుట్టలో నూతనంగా ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ భవనాన్ని మంత్రి వాకిటీ శ్రీహరి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవితో కలిసి ప్రారంభించారు. వీరితో పాటు వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మామిళ్లపల్లి విష్ణు వర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ హాస్టల్ భవనం ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ. 1.20 కోట్ల వ్యయంతో నిర్మించబడినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి మర్రికుంటలోని కేజీబీవీ పాఠశాలలో అదనపు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు రూ. 80 లక్షలతో శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి ఎస్సీ సంక్షేమ హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థులు బాగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరాలని సూచించారు.

ఎంపీ మల్లు రవి స్వయంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకున్నారని, అందుకే అయన సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు ప్రాధాన్యత ఇస్తూ నూతన భవన నిర్మాణానికి సహకరించరన్నారు. వనపర్తి లో ఇంత మంచి హాస్టల్ భవనాన్ని నిర్మించినందుకు ఎంపీ ని అభినందించారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యార్థులు సైతం ఎంపీ మల్లు రవికి కృతజ్ఞతలు తెలిపారు.

ఎంపీ మల్లురవి విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story