Seethakka Vs Konda Surekha: కొండా సురేఖపై మంత్రి సీతక్క నిప్పులు!
Seethakka Vs Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానంపై మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క సంచలన రీతిలో స్పందించారు.
Seethakka Vs Konda Surekha: కొండా సురేఖపై మంత్రి సీతక్క నిప్పులు!
Minister Seethakka: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ, పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రధానమైనదని తేల్చిచెప్పారు.
రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేయడం వల్లే కాంగ్రెస్ అధిష్టానం తనను మంత్రివర్గం నుంచి తొలగించిందంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సీతక్క తీవ్రంగా ఖండించారు. "బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగిపోయేంత బలహీనంగా కాంగ్రెస్ అధిష్టానం లేదు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవు," అని స్పష్టం చేశారు.
పార్టీ నియమావళికి ప్రతీ ఒక్కరూ కట్టుబడి ఉండాలని సీతక్క గుర్తుచేశారు. పార్టీలో ఏవైనా అభిప్రాయభేదాలు లేదా సమస్యలు ఉంటే అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకోవాలే తప్ప బహిరంగంగా వ్యాఖ్యానించడం సరైనది కాదు. పార్టీ ఇచ్చే నిర్ణయమే తుది నిర్ణయం. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో పనిచేసినప్పుడే పార్టీకి, ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు సీతక్క గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడటానికి బీఆర్ఎస్ నేతలు భుజాలు ఎగరేస్తున్నారు. అసలు వారి సొంత పార్టీలో ఏం జరిగిందో తెలుసుకోవాలి.
కవితను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపారో కేటీఆర్ ముందుగా సమాధానం చెప్పాలని నిలదీశారు. చివరగా, ఎవరి వ్యక్తిగత విభేదాలు ఏవైనా సరే, రాష్ట్రాభివృద్ధికి , కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని సీతక్క ధీమా వ్యక్తం చేశారు.




