Ponnam Prabhakar: కేసీఆర్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
Ponnam Prabhakar: కేసీఆర్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Ponnam Prabhakar: కేసీఆర్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
Ponnam Prabhakar: ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్ బాధ్యతలను విస్మరించారని, ఆయన వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ డిమాండ్‌తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈనెల 6న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సన్నాహక సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, పదేళ్ల కాలంలో వంద ఏళ్ల విధ్వంసం జరిగిందని మంత్రులు మండిపడ్డారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ఈ మహా ధర్నా ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ వద్ద జరగనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని వారు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.




