Konda Surekha: భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం.. బర్తరఫ్‌పై స్పందించిన కొండా సురేఖ

Konda Surekha: తెలంగాణ మంత్రివర్గం నుంచి తన బర్తరఫ్‌ నిర్ణయాన్ని ఖండించిన కొండా సురేఖ.

Arun Chilukuri
Published on: 3 Sept 2026 4:06 PM IST
Konda Surekha
X

Konda Surekha: భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం.. బర్తరఫ్‌పై స్పందించిన కొండా సురేఖ

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు సిఫారసు చేయడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తనను బర్తరఫ్ చేయాలన్న నిర్ణయాన్ని తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తనను తొలగించే ముందు కనీసం తన వివరణ తీసుకోవాల్సిందని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. తన కుమార్తె ఒక స్వతంత్ర మహిళ అని, ఆమె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని అన్నారు. తన కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాలను తాను ఖండించాల్సిన అవసరం లేదని, ఆమెను తప్పుబట్టే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి తాను రాసిన లేఖను మీడియాకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

పార్టీలో జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుందని ఆమె ప్రశ్నించారు. తనపై పూర్తిగా కక్షపూరితంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు భావిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయాణంలో ముగ్గురు బీసీ మహిళలకు పదవులు వచ్చేలా చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. అయితే తన కోసం చిన్నారెడ్డిపై వేటు వేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తనను ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదని, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే స్పష్టత ఇస్తామని కొండా సురేఖ వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story