Jupally Krishna Rao: బీఆర్ఎస్ అబద్ధాలు చెప్తోంది.. పాలమూరు ప్రాజెక్టుపై జూపల్లి ఫైర్!
Jupally Krishna Rao: గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు, పాలమూరు ప్రాజెక్టు అబద్ధాలపై ఆయన బీఆర్ఎస్ నేతలను నిలదీశారు.
Jupally Krishna Rao: బీఆర్ఎస్ అబద్ధాలు చెప్తోంది.. పాలమూరు ప్రాజెక్టుపై జూపల్లి ఫైర్!
Jupally Krishna Rao: రాష్ట్రంలో గత ప్రభుత్వ నాయకులకు సరైన అవగాహన, ఆలోచన లేకపోవడం వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ నేతలు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆయన మండిపడ్డారు.
మంత్రి జూపల్లి ప్రధాన విమర్శలు:
నీళ్లు లేని చోట గత పదేళ్లలో అనేక ప్రాజెక్టులు నిర్మించి ప్రజా ధనాన్ని వృథా చేశారని జూపల్లి విమర్శించారు. బీఆర్ఎస్కు ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే, దానిని రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లోకి ఎందుకు నెట్టారని ఆయన నిలదీశారు. ఇంత భారీ స్థాయిలో అప్పులు చేయడానికి కారణమేంటని ప్రశ్నించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కాలువలకు ఇప్పటి వరకు అనుమతులే రాలేదని జూపల్లి స్పష్టం చేశారు. "ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేశామని మీరు చెబుతున్నది పచ్చి అబద్ధం. ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తోంది మీరా? లేక మేమా?" అంటూ బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా గత ప్రభుత్వ నాయకులు మాట్లాడుతున్నారని, వాస్తవాలను త్వరలోనే బయటపెడతామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.




