Peddapalli: కేటీఆర్ వ్యాఖ్యలు ఆకాశంపై ఉమ్మివేసినట్లే.. మంత్రి అడ్లూరి
Peddapalli: పదేళ్ల పాలనలో ఉద్యమకారులను విస్మరించిన కేటీఆర్, కాంగ్రెస్ కార్యకర్తల గురించి మాట్లాడటం విడ్డూరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
Peddapalli: కేటీఆర్ వ్యాఖ్యలు ఆకాశంపై ఉమ్మివేసినట్లే.. మంత్రి అడ్లూరి
Peddapalli: పదేళ్లపాటు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులను కార్యకర్తలను పట్టించుకోని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో శుక్రవారం సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మండలంలోని నంది మేడారంలో 5 కోట్ల75లక్షలతో ఎన్ హెచ్ఎం నిధులతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని,జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ప్రారంభించారు. ఈయొక్క హాస్పిటల్ భూ విరాళం ఇచ్చిన పొనుగోటి మురళీధర్ రావును శాలువాతో మంత్రి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరుగుతుందని వారిని పట్టించుకోవడం లేదని కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పచ్చ కామెర్ల వానికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు గత 10యేండ్ల గడిల పాలనలో బిఆర్ఎస్ పార్టీ చేసింది అదే కదా. అని ఎద్దేవా చేసారు. కేసీఆర్ ,కేటీఆర్ హరీష్ రావు,సంతోష్ రావు,కవిత వీళ్ళ రాజ్యంలో సామాన్య కార్యకర్తలకు చోటు ఇవ్వలేదని ప్రాణాలు పణంగా పెట్టిన ఉద్యమ కారులతో పాటు చివరకు ఆ పార్టీలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కూడా తమ పక్కన కూర్చుండ నివ్వలేదని
చేయిపట్టి గుంజినది వాస్తవం కాధా అని మంత్రి ప్రశ్నించారు..
కాంగ్రెస్ పార్టీని అనడం పట్ల ఆకాశం పైకి ఉమ్మేసినట్లు ఉంది కాదా,అని అది వాళ్ళ పైనే పడుతుందని అన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిందని తమ ప్రాంత సమస్యలు చెప్పుకునే అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్,సూపరిడెంట్ శ్రీధర్,మార్కెట్ చైర్మన్ రూప్ల నాయక్,వైస్ చెర్మెన్ అరిగే లింగయ్య, సర్పంచ్ వీర్పాల్ తో పాటు పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు.




