Rajanna Sircilla: మిడ్ మానేర్ అప్‌డేట్ 10 గేట్లు ఎత్తివేత.. నీటి విడుదల

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేర్ రిజర్వాయర్ నీటిమట్టం 10.71 టీఎంసీలకు చేరింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 March 2026 8:16 AM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: మిడ్ మానేర్ అప్‌డేట్ 10 గేట్లు ఎత్తివేత.. నీటి విడుదల

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్ నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయం 6 గంటల నాటికి నీటి మట్టం 318 మీటర్ల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను 309.56 మీటర్ల వద్ద నమోదైంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలకు గాను ప్రస్తుతం 10.71 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.

ప్రస్తుతం రిజర్వాయర్‌కు ఎటువంటి ఇన్‌ఫ్లోలు లేవు. మరోవైపు అవుట్‌ఫ్లోలు మాత్రం కొనసాగుతున్నాయి. రిజర్వాయర్ నుంచి మొత్తం 2310 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో రైట్ గేట్ ద్వారా 1500 క్యూసెక్కులు, రైట్ మెయిన్ కాలువ ద్వారా 550 క్యూసెక్కులు, లెఫ్ట్ మెయిన్ కాలువ ద్వారా 5 క్యూసెక్కులు విడుదల అవుతుండగా, ఆవిరీభవనం ద్వారా 210 క్యూసెక్కులు, మరో 45 క్యూసెక్కులు ఇతర మార్గాల ద్వారా బయటకు వెళ్తున్నాయి.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం 25 స్పిల్‌వే గేట్లలో 10 గేట్లు తెరిచి ఉంచారు. 9 నుండి 18 వరకు గేట్లు అర్ధ మీటర్ ఎత్తులో ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story