Rajanna Sircilla: మిడ్ మానేర్ అలెర్ట్ పడిపోతున్న నీటి మట్టం.. ప్రస్తుత నిల్వ ఎంతంటే?
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేర్ రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం వివరాలు. 27.55 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 9.281 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.
Rajanna Sircilla: మిడ్ మానేర్ అలెర్ట్ పడిపోతున్న నీటి మట్టం.. ప్రస్తుత నిల్వ ఎంతంటే?
రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం: కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వ స్థితి తగ్గుతూ ఉంది. ఉదయం 6:00 గంటల సమయానికి రిజర్వాయర్‌లోని నీటి మట్టం +308.53 మీటర్లు గా నమోదయింది. గరిష్ట స్థాయి 318 మీటర్లు, కాబట్టి ప్రస్తుతం కొద్దిగా తగ్గుదల కనిపిస్తోంది.
నిల్వ సామర్థ్యం: రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 9.281 టీఎంసీలు మాత్రమే నీటి నిలువ ఉంది.
ఇన్‌ఫ్లోలు
గత కొన్ని రోజులుగా రిజర్వాయర్‌లో ఎలాంటి కొత్త నీటి ప్రవాహాలు (ఇన్‌ఫ్లోలు) నమోదవడం లేదు.
SYP (GPH): 1431 క్యూసెక్కులు
SRSP: Nil
Flood (Manair + Mulavagu + FFC Inlets): Nil
అవుట్‌ఫ్లోలు
రిజర్వాయర్ నుంచి మొత్తం 2635 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఇందులో:
రైట్ సైడ్ (R/S): 2000 Cs
రైట్ మెయిన్ కాల్వ (RMC): 450 Cs
లెఫ్ట్ మెయిన్ కాల్వ (LMC): 5 Cs
ఆవిరీభవనం (Evp): 135 Cs
MB ద్వారా: 45 Cs
గేట్ల పరిస్థితి
స్పిల్‌వే గేట్లు ఈ రోజు ఒక్కటీ తెరవబడలేదు
రైట్ సైడ్ గేట్లు 4/4 పూర్తి స్థాయిలో తెరిచి ఉన్నాయి
గేట్లు నంబర్లు 1 నుంచి 4 వరకు ఒక్కోటి 0.8 మీటర్ల ఎత్తులో నీరు విడుదల చేస్తున్నారు.




