Jammikunta: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం.. మెప్మా పీడీ స్వరూప రాణి

Jammikunta: జమ్మికుంటలో మహిళా సంఘాల సభ్యులకు స్కూల్ యూనిఫాం కుట్టడంలో ప్రత్యేక శిక్షణ. మెప్మా పీడీ స్వరూప రాణి పర్యవేక్షణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 April 2026 5:22 PM IST
Jammikunta
X

Jammikunta: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం.. మెప్మా పీడీ స్వరూప రాణి

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట రాష్ట్ర ప్రభుత్వం, మిషన్ డైరెక్టర్ ఆఫ్ మెప్మా ఆదేశాల మేరకు మహిళా సంఘాల సభ్యులకు స్కూల్ యూనిఫాం కుట్టడంలో నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు జమ్మికుంట మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. స్వరూప రాణి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పిడి స్వరూప రాణి మాట్లాడుతూ, మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి అవకాశాలు పెంపొందించి ఆర్థిక స్వావలంబన సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

“కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యం. మహిళలు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పెంచుకోవాలి” అని పేర్కొన్నారు.మహిళలు ఇప్పటికే ఇంటి వద్ద టైలరింగ్ పనులు చేస్తున్నారని, ఈ శిక్షణ ద్వారా వారికి మరింత సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు.

ఈ శిక్షణలో 41 మంది మహిళా సంఘ సభ్యులు పాల్గొంటున్నారని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాలుగు రోజులపాటు శిక్షణ కొనసాగుతుందని వివరించారు. శిక్షణ పొందుతున్న సభ్యులకు మధ్యాహ్న భోజనంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, శిక్షణను సమర్థవంతంగా వినియోగించుకుని భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను విస్తరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా డీఎంసీ శ్రీవాణి, ఇంచార్జ్ h జ్యోతి, స్వరూప, మంజుల తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story