Medak: పాఠశాలలో కలెక్టర్ పాఠాలు.. విద్యార్థులకు అక్షాంశాలు

Medak: మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రామాయంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు దామరచెరువు రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 April 2026 5:31 PM IST
Medak
X

Medak: పాఠశాలలో కలెక్టర్ పాఠాలు.. విద్యార్థులకు అక్షాంశాలు

మెదక్: పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని , రేషన్ షాపులు నిర్వహణ అత్యంత పారదర్శకంగా. నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.బుధవారం, జిల్లాలోని రామాయంపేట గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని దామరచెరువు గ్రామంలో రేషన్ షాపును జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అందిస్తోన్న మౌలిక వసతులు, బోధన విధానం, ఉపాధ్యాయుల హాజరు, తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలించారు.మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు అవుతుందో.. లేదో.. పర్యవేక్షించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే భోజన శాలను పరిశీలించి, ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.ప్రధానంగా గుడ్ల నాణ్యతను పరీక్షించి, వంట సామాగ్రి, సరుకులు, బియ్యం తదితరాలను తనిఖీ చేసి, గడువు తేదీలను సరిచూసుకోవాలన్నారు. పాఠశాల పరిసరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు.

అదే విధంగా ప్రతి తరగతి గదిని సందర్శించి, విద్యార్థులకు బోధన చేశారు. ఈనెల 12వ తారీకు పదవ తరగతి సోషల్ ఎగ్జామ్ ఉన్న కారణంగా సోషల్ సబ్జెక్టు పై అక్షాంశాలు ,రేఖాంశాలు నిశితంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులభ విధానాల ద్వారా కలెక్టర్ బోధించారు.

అలాగే విద్యార్థులలో పాఠ్యాంశాలపై అవగాహన పెంచే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ సబ్జెక్టు పై విద్యార్థులు బోర్డు మీద ఉదాహరణలతో బోధించాలన్నారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా కలెక్టర్ మాట్లాడి, పాఠ్యాంశాలను చదివించి, అందులోని ప్రశ్నలు అడుగుతూ, వారి బోధన సామర్థ్యాలను పరీక్షించారు. ఈ మేరకు చదువుపై ఆసక్తి పెంచుకునేలా ప్రోత్సహించారు.

అంతేకాకుండా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి,. పరీక్షల సమయంలో సరైన ఆహారం తీసుకోవాలని, కంటినిండా నిద్ర పోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పట్టుదలతో కష్టపడి చదివి ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

రేషన్ షాపును పరిశీలించి స్టాక్ వివరాలు, లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ సక్రమంగా అందుతుందా లేదా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన 99 ప్రగతి ప్రణాళికలో భాగంగా రామాయంపేటలో విస్తృతంగా పర్యటించడం జరిగిందని తెలిపారు రేషన్ కార్డులు కలిగిన

రబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని ఎటు వంటి సమస్యలకు తావు లేకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారన్నారు.ఈ పరిశీలనలో రామాయంపేట తాసిల్దార్ రజని , కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story