Karimnagar: కోతిరాంపూర్‌లో పూలే వేడుకలు సామాజిక విప్లవకారుడికి అంజలి

Karimnagar: కరీంనగర్ కోతిరాంపూర్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 11 April 2026 2:56 PM IST
Karimnagar
X

Karimnagar: కోతిరాంపూర్‌లో పూలే వేడుకలు సామాజిక విప్లవకారుడికి అంజలి

కరీంనగర్: భారతదేశ సామాజిక విప్లవ పితామహుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, 200వ జయంతి వేడుకలను శనివారం కరీంనగర్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. నగరంలోని కోతిరాంపూర్ లో ఉన్న పూలే విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి ,కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు,నాయకులు కార్యకర్తలు శ్రేణులు, పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story