Mahabubabad: జంక్ ఫుడ్‌కు నో.. హెల్తీ ఫుడ్‌కు ఎస్! మహబూబాబాద్‌లో ఆరోగ్య ప్రచార గర్జన
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈట్ రైట్ వాక్ కార్యక్రమం.
Mahabubabad: జంక్ ఫుడ్‌కు నో.. హెల్తీ ఫుడ్‌కు ఎస్! మహబూబాబాద్‌లో ఆరోగ్య ప్రచార గర్జన
మహబూబాబాద్ జిల్లా: జిల్లా ప్రజాపాలన ప్రగతి’ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు నిర్వహించే ఆరోగ్య వారంలో భాగంగా మొదటి రోజు సోమవారం ప్రజల్లో సురక్షిత ఆహారపు అలవాట్లు, పోషకాహారంపై అవగాహన, మరియు ఆహార భద్రత ప్రమాణాల అమలు పట్ల చైతన్యం కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈట్ రైట్ వాక్”కార్యక్రమంను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి రవి రాథోడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం కళాకారుల బృందం ఆరోగ్య భద్రత పై పాటలు పాడుతూ డప్పు చప్పుళ్లతో పట్టణ కేంద్రంలోని జిల్లా కోర్టు వద్ద ప్రారంభమై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH), మహబూబాబాద్ వరకు సాగింది.ఈ వాక్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.ఆహార భద్రత నిబంధనల అమలు బలోపేతం చేయడం, ఆహార ద్వారా వ్యాపించే వ్యాధులను (Food Borne Illnesses) నివారించడం
సురక్షితమైన, శుభ్రమైన మరియు పోషకాహారపు అలవాట్లను ప్రోత్సహించడం, ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ ప్రజలకు శుభ్రమైన ఆహారం తీసుకోవడం, ఆహార పదార్థాల నిల్వ, వంటలో పరిశుభ్రత పాటించడం, కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను వాడకూడదని, పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే, ప్రజలు లైసెన్సు కలిగిన మరియు పరిశుభ్రమైన ఆహార కేంద్రాల నుంచే ఆహారం కొనుగోలు చేయాలని, ఆహార భద్రతపై అనుమానాలు ఉన్నచో సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈట్ రైట్” వంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి పెంపొందించడంలోసమాజంలో సురక్షిత ఆహార సంస్కృతిని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ధర్మేంద్ర అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా అద్యక్షులు డాక్టర్ జగదీశ్వర్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ధర్మేంద్ర, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ పురుషోత్తమ్ ఎంపిహెచ్‌ఈఓ లు శ్రీనివాస్, కేఎల్‌ఎన్ స్వామి, తోట శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ లు రాజేందర్, శ్రీహరి, జిల్లా పౌర సంభందాల అధికారి కళాకారుల బృందం, నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు, ట్రైబల్ వెల్ఫేర్ పాటశాల విద్యార్హినీలు, స్టానిక అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




