Mahabubabad: స్కూళ్లలో ఏఐ బోధన.. ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం
Mahabubabad: తొర్రూరులో గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్.
Mahabubabad: స్కూళ్లలో ఏఐ బోధన.. ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ పాఠశాల, అప్పర్ ప్రైమర్ హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. మెజిస్ట్రేట్, జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల)ప్రీ మెట్రిక్ , పోస్ట్ మెట్రిక్ అప్పర్ ప్రైమర్ హాస్పిటల్, హెల్త్ సెంటర్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో తరగతి గదులు, డార్మెంటరీ, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, టాయిలెట్స్, పరిసరాలను పరిశీలించి విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు.
ప్రభుత్వం కల్పించే పక్కా డైట్ మెనూ ను కచ్చితంగా అమలు చేయాలని, నాణ్యమైన వేడివేడి ఆహార పదార్థాలను అందించాలని, భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ భోజనం, టిఫిన్స్, స్నాక్స్ సిద్ధం చేయాలని,పిల్లలకు, వసతి గృహాలు పాఠశాలలో భోజనం సిద్ధం చేసే సిబ్బందికి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి అట్టి నివేదికలను సమర్పించాలని సంబంధిత వార్డెన్, ప్రిన్సిపల్ను ఆదేశించారు. ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన వసతి గృహాలను క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్, భోజనం, డిన్నర్ సమయాలలో సందర్శించి వారితో కలిసి భోజనం చేయాలని సూచించారు.
ప్రతి విద్యా సంస్థ వసతి గృహాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన కి సంబంధిత శాఖ ప్రధాన అధికారి లేదా ప్రత్యేక అధికారి వద్దనే ఉండాలని, భోజనం, సౌకర్యం తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో విద్యార్థిని విద్యార్థులకు అన్ని ఏర్పాట్లను, సౌకర్యాలను కల్పించాలని తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు, వసతి గృహాలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ,సానిటేషన్ లపై పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు, పిల్లల యొక్క హాజరు శాతం పూర్తిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు,
నూతన టెక్నాలజీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తరగతులను నిర్వహించి ఉత్తమ ఫలితాలను సాధించుటకు కృషి చేయాలని తెలిపారు, పిల్లల యొక్క మానసిక, ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని విద్యతోపాటు క్రీడల్లో నైపుణ్యత ఉండే విధంగా ప్రతి విభాగం టీచర్ ముందుకు సాగాలన్నారు. అనంతరం అప్పర్ ప్రైమర్ హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ ను సందర్శించి ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మందుల స్టాక్ రిజిస్టర్, తదితర రికార్డులను తనిఖీ చేశారు, హాస్పిటల్ పరిధిలోని సబ్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా మెరుగైన వైద్యం ప్రతి ఒక్కరికి అందించాలని సూచించారు, వైద్యం కోసం వచ్చే వారికి సేవలు అందించడం కోసం డాక్టర్స్ నిత్యం అందుబాటులో ఉండాలని, వేసవి ప్రభావం నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరం ఉన్నచోట వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని మాత, శిశు మరణాలను జరగకుండా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది పోలీస్ సంబంధిత విభాగాలు నిత్యం ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా పెట్టాలని ఆదేశించారు. అక్రమ స్కానింగ్ లు, లింగ నిర్ధారణ పరీక్షలు నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు,
వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ధైర్యం భరోసా కల్పించాలని తమ పరిధిలో ఉన్నటువంటి సేవలను వేగంగా అందించాలని సూచించారు. ఆశా కార్యకర్తలతో మాట్లాడుతూ వార్డు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను మెయింటైన్ చేయాలని, గర్భిణీ స్త్రీలను, చిన్న పిల్లలను ఇతర వ్యాధిగ్రస్తులను గమనిస్తూ ఉండాలని, సూచించారు. కలెక్టర్ వెంట తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారి గణేష్, సాంఘిక సంక్షేమ శాఖ డిసిఓ జయశ్రీ, ప్రిన్సిపల్ రత్నమాల, హాస్పిటల్ డాక్టర్స్ సుగుణాకర్ రాజు, నందన దేవి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు,


