LB Nagar: ఎల్బీనగర్‌లో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ
LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఆవిష్కరించారు.
LB Nagar: ఎల్బీనగర్‌లో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ
LB Nagar: ఐక్యత, చైతన్యం ద్వారానే బీసీలు రాజకీయంగా.. ఆర్థికంగా, వ్యాపారంగా ఎదుగగలరని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి విగ్రహావిష్కరణ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మధుయాష్కి గారు దొడ్డి కొమరయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎస్కే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మధుయాష్కి గారు మాట్లాడుతూ.. నిజాం అరాచక పాలన, దేశ్ ముఖ్ ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణ త్యాగం చేసిన దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి తో బహుజనులు రాజకీయంగా చైతన్యం కావాలన్నారు. డబ్బుమయమైన ప్రస్తుత రాజకీయాలను ఆర్థికంగా ఎదుర్కొనే ఎదుర్కొనే స్తోమత బీసీలకు లేదని.. కేవలం చైతన్యం ద్వారానే రాజ్యాధికారం సాధించగలమని సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకొని అన్ని విధాలుగా నష్టపోయింది బీసీలేనని .. తెలంగాణ వచ్చాక కూడా అన్ని విధాలుగా నష్టపోయింది కూడా బీసీ లేనని పేర్కొన్నారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు గొర్లు బండ్లు ఇచ్చి వాళ్ళు మాత్రం వేల కోట్లు దోచుకున్నారన్నారు. చైతన్యం లేకనే బీసీలు ఎన్నికల్లో నిలబడితే గెలిపించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుల సంఘాలలో కొందరు దోపిడీదారులు ఉంటారని వారిని గుర్తించి పక్కకు పెట్టినప్పుడే.. సంఘం, కులం బలపడుతుందని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హాయంలో నగరంలో కల్లు దుకాణాలను బంద్ చేస్తే తాను నిజాం కాలేజీలో సభ పెట్టి పోరాడానని పేర్కొన్నారు.
కుల సంఘాల భవనాలను ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాపార ధోరణిని ఆ కుల సంఘాల ప్రతినిధులు చైతన్యంతో తిప్పుకొట్టాలని సూచించారు. కార్యక్రమంలో కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ కురుమ గారు, ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షులు మల్లేష్ కురుమ గారు, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ గారు, రాష్ట్ర నాయకులు రవికుమార్ కురుమ, కే వెంకటేశ్ కురుమ, గౌడ్ రాజకుమార్ గారు, రావుల ఐలయ్య గారు, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్ గారు, నేలపాటి రామారావు గారు, బుడ్డ సత్యనారాయణ గారు, డివిజన్ అధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్ గారు, రేణు గౌడ్ గారు, శరత్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు.




