KTR: నేతన్నలను ఆదుకోండి.. డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ విజ్ఞప్తి!

KTR: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కలిశారు.

Arun Chilukuri
Published on: 25 March 2026 5:18 PM IST
KTR
X

KTR: నేతన్నలను ఆదుకోండి.. డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ విజ్ఞప్తి!

KTR: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కలిశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఆర్థిక కష్టాల నుంచి నేతన్నలను గట్టెక్కించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సిరిసిల్ల పవర్ లూమ్‌పై ఉన్న సుమారు రూ.38 కోట్ల విద్యుత్ భారంతో పాటు, పేరుకుపోయిన బ్యాక్ బిల్లింగ్, సర్‌ఛార్జ్‌లను తక్షణమే మాఫీ చేయాలని కేటీఆర్ కోరారు.

గతంలో ఉన్న విధంగానే పరిశ్రమకు నిరంతర విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలని, పాత బకాయిలతో సంబంధం లేకుండా నేతన్నలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతో కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టే ప్రమాదం ఉందని, వారికి తక్షణమే ఆర్థిక వెసులుబాటు కల్పించి భరోసా ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story