KTR: తెలంగాణకు పీడ దినాలు.. కాంగ్రెస్ మోసాలపై కేటీఆర్ చార్జ్‌షీట్ విడుదల!
KTR: తెలంగాణలో కాంగ్రెస్ పాలన వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేస్తూ చార్జ్‌షీట్ విడుదల చేశారు.
KTR: తెలంగాణకు పీడ దినాలు.. కాంగ్రెస్ మోసాలపై కేటీఆర్ చార్జ్‌షీట్ విడుదల!
KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మోసాలపై బీఆర్‌ఎస్ పార్టీ తరఫున చార్జ్‌షీట్ విడుదల చేశారు. రాష్ట్రంలో దళితులను దగా చేశారని, పీడ దినాలు పట్టాయని ఆరోపించారు.
రాష్ట్రంలో అనేక సమస్యలతో రైతులు ధాన్యం కుప్పల మీద చనిపోతున్నారని, నీళ్లు అడిగితే సీఎం రక్తం పారిస్తానంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రైతు బీమాను రద్దు చేశారని, కాళేశ్వరంపై కక్ష రైతులకు శిక్షగా మారిందని మండిపడ్డారు.
జాబులు అడిగితే లాఠీలతో కొడుతున్నారని, ఉద్యోగాలు అడిగితే బావిలో దూకమంటున్నారని విమర్శించారు. ప్రశ్నించిన ఇంజినీర్లను బెల్టుతో కొడతానని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు.
చదువురాని వ్యక్తి చేతుల్లో విద్యాశాఖ ఉందని, విద్యాసంస్థల భూములను గుంజుకుంటూ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగిన కాలేజీలను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో స్కామ్‌ల జాతర సాగుతోందని, వాటాల కోసం మంత్రులు కుక్కలా కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మూసీకి కోట్ల నిధులు ఖర్చు పెడుతున్నారని, రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని ఆరోపించారు.
కేసీఆర్ రాజీనామా చేయాలని సీఎం అంటున్నారని, కేసీఆర్ రాజీనామా చేస్తేనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తుచేశారు. కేసీఆర్ అనే నాయకుడు లేకుంటే రేవంత్‌కు సీఎం పదవి వచ్చేదా అని ప్రశ్నించారు.




