KTR: ఢిల్లీ చేతిలో తెలంగాణ తల్లడిల్లుతోంది.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఆగ్రహం!
KTR: ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ రాష్ట్రం మళ్లీ తల్లడిల్లుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
KTR: ఢిల్లీ చేతిలో తెలంగాణ తల్లడిల్లుతోంది.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఆగ్రహం!
KTR: ఢిల్లీ నాయకత్వం చేతిలో తెలంగాణ రాష్ట్రం మళ్లీ తల్లడిల్లుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరి భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాక కూడా.. ప్రస్తుత పాలకులు సామంతుల్లా ఢిల్లీకి కప్పం కట్టే దుస్థితిని మళ్లీ తీసుకువచ్చారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ సంపదను, నిధులను ఢిల్లీకి పంపడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించిందేమీ లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులను సీఎం రేవంత్‌రెడ్డి కావాలనే ఆన్ చేయడం లేదని మండిపడ్డారు. రైతులకు నీళ్లు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బీఆర్‌ఎస్ తెచ్చిన ప్రాజెక్టులపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. జయశంకర్ సార్ ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగుతోందని విమర్శించారు.




