KTR: అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డే పెద్ద 'క్రిమినల్ వేస్ట్'.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
KTR: తెలంగాణలో నిరుద్యోగుల ఆవేదన, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
KTR: అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డే పెద్ద 'క్రిమినల్ వేస్ట్'.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
KTR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని, అధికారంలోకి వచ్చే ముందు యూత్ డిక్లరేషన్ పేరుతో ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
రాష్ట్రంలో 20 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను మోసగించడమేనని కేటీఆర్ మండిపడ్డారు. "ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావాలని, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను క్రిమినల్ వేస్ట్ అని సంబోధించడానికి సీఎంకు మనసెలా వచ్చింది? రాష్ట్రంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డే నిజమైన క్రిమినల్ వేస్ట్" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ కింద కాంగ్రెస్ పార్టీ 24 రకాల హామీలు ఇచ్చిందని, అందులో ఒక్క హామీనైనా నెరవేర్చారా అని కేటీఆర్ నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి చదువుపై తనకు అనుమానాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. "రేవంత్ రెడ్డి ఏం చదివారో కూడా నాకు డౌటే. ఆయన కనీసం తన ఎన్నికల నామినేషన్ పత్రాన్ని సొంతంగా నింపుకోగలరా? తన జీవితంలో ఆయన ఏనాడైనా ఒక్క ఉద్యోగ ఇంటర్వ్యూకైనా వెళ్లారా?" అని తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు.




