Hyderabad: కేటీఆర్, హరీశ్‌రావు అరెస్ట్.. ఎర్రవల్లికి పాదయాత్రగా వెళ్తుండగా..
Hyderabad: ఎర్రవల్లికి పాదయాత్రగా వెళ్తున్న కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad: కేటీఆర్, హరీశ్‌రావు అరెస్ట్.. ఎర్రవల్లికి పాదయాత్రగా వెళ్తుండగా..
Hyderabad: ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బొల్లారం వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోగా, హకీంపేట వద్ద కేటీఆర్, హరీశ్‌రావులను నిలిపివేశారు. దీంతో వారు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ ఇంటిపైకి దూసుకెళ్లేందుకు కుట్ర జరుగుతోందని, ఈ విషయంలో పోలీసుల తీరుపై కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా వందలాది మంది బలగాలను మోహరించామని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల భద్రతపై నమ్మకం లేదని, మా నాయకుడిని మేమే కాపాడుకోవాలంటూ కేటీఆర్ ముందుకు సాగారు. కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అటువైపు వెళ్లకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవల్లికి పాదయాత్రగా బయల్దేరడంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి జవహర్‌నగర్, బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు.




