Kondagattu: వైభవంగా రాములోరి పెళ్లి.. తరలివచ్చిన భక్తజనం
Kondagattu: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.
Kondagattu: వైభవంగా రాములోరి పెళ్లి.. తరలివచ్చిన భక్తజనం
Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక వేదికను ఏర్పరిచి శ్రీ సీతారాముల ఉత్సవమూరులను పల్లకిలో ఊరేగింపు గా పందిరిలోకి తీసుకువచ్చి కల్యాణం జరిపించారు.
అంజన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు, హనుమాన్ మాలా దారులు ఈ వేడుకలో పాల్గొని కళ్యాణం తిలకించి తరించారు.అంజన్న క్షేత్రం రామనామ స్మరణతో మారు మోగింది. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజన రెడ్డి అర్చకులు అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




