Karimnagar: రాములోరి పెళ్లి సందడి.. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు!

Karimnagar: ఆలయాలు శ్రీరామనవమి కళ్యాణోత్సవాలకు సిద్ధమయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 1:20 PM IST
Karimnagar
X

Karimnagar: రాములోరి పెళ్లి సందడి.. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు!

కరీంనగర్: శ్రీ సీతారాముల కళ్యాణానికి నగరంలోని అన్ని ఆలయాలు ముస్తాబయ్యాయి. వాడవాడలా స్వామివారి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని కోదండ రామాలయం, పాత బజార్ శివాలయం, మహాశక్తి ఆలయం, హరి హర క్షేత్రం, కొత్తపెళ్లి రామాలయం, సాయి నగర్ సాయిబాబా ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు కళ్యాణ వేడుకలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి.

ప్రతి ఆలయంలో మజ్జిగ మంచినీళ్లు పంపిణీ..

ప్రతి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి వసతి, మజ్జిగ పంపిణీ, భోజనాల ఏర్పాట్లను ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని వేములవాడ ఆలయంలో హుజరాబాద్ ఇల్లందకుంట రామాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. నగరంలోని మహాశక్తి ఆలయంలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story