Karimnagar: బ్యాంక్ మేనేజరే నిందితుడు.. కరీంనగర్‌లో భారీ కుంభకోణం!
Karimnagar: కరీంనగర్‌లో రూ. 137 కోట్ల భారీ సైబర్ స్కామ్‌ను పోలీసులు ఛేదించారు.
Karimnagar: బ్యాంక్ మేనేజరే నిందితుడు.. కరీంనగర్‌లో భారీ కుంభకోణం!
కరీంనగర్: కరీంనగర్లో 137 కోట్ల స్కాంను బయటపెట్టిన పోలీసులు. కమిషనరేట్ పోలీసులు ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0 కింద సైబర్ మోసాలకు సహకరించే మ్యూల్ బ్యాంకు ఖాతాల నెట్వర్క్ ను చేదించారు. మొత్తం 24 మంది వ్యక్తులను గుర్తించగా అందులో నుండి 13 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ముఖ్య నిర్వాహకుడు బండారి సాయిరాం అనే వ్యక్తి కొంతమందితో కలిసి ఈ నెట్వర్క్ ను నడిపిస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. ప్రధాన నిందితుడికి ప్రతి లావాదేవి పై రెండు శాతం కమిషన్ ఎస్ డి టి క్రిప్టో కరెన్సీ రూపంలో పొందేవాడని అన్నారు. ఇతనికి విదేశీ వ్యక్తులు చైనీస్ నేషనల్స్ తో సంబంధాలు ఉన్నాయని అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో సంబంధాలు పెట్టి కొని నడిపిస్తున్నట్లు చెప్పారు.
రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ తో కార్యకలాపాలు..
ప్రధాన నిందితుడికి ఇతనికి కిసాన్ నగర్ లో ఉన్న రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకుకు సంబంధించిన కొంతమంది సిబ్బందితో కలిసి ఈ పని నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆర్.బి.ఎల్ బ్యాంకుకు సంబంధించిన మేనేజర్ భువనగిరి కళ్యాణ్, క్యాషియర్ ఆయేషా బేగం సహకరించినట్లు తెలిపారు. వర్చువల్ ఖాతాల ద్వారా సుమారు 12 కోట్లు, ఆర్ బి ఎల్ బ్యాంకుకు చెందిన ఏడు మ్యూల్ ఖాతాల్లో 125 కోట్లకు పైచీలు లావాదేవీలు జరిగినట్టు మొత్తం 137 కోట్ల భారీ కుంభకోణం బయటపడిందని అన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ప్రజలకు పోలీస్ కమిషనర్ ముఖ్య సూచన..
ప్రజలు వారి యొక్క బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఇవ్వవద్దని, డబ్బు ఆశతో ఇతరుల కోసం ఖాతాలు తెరవద్దని దీనివల్ల సైబర్ నేరాలలో చిక్కుకుంటారని తెలిపారు. నెట్వర్క్ ఖాతాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనుమానాస్పద సైబర్ కార్యకలాపాలన వెంటనే పోలీసులకు లేదా 1930 సైబర్ హెల్ప్ లైన్ కు తెలియజేసి సహకరించాలని కోరారు.




