Karimnagar: మాజీ సర్పంచ్ వినూత్న నిరసన.. ప్రజావాణిలో డప్పు దండోరా!
Karimnagar: కరీంనగర్ ప్రజావాణిలో 10 ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కావడం లేదని సుందరగిరి మాజీ సర్పంచ్ వెంకటస్వామి డప్పు కొట్టి నిరసన తెలిపారు.
Karimnagar: మాజీ సర్పంచ్ వినూత్న నిరసన.. ప్రజావాణిలో డప్పు దండోరా!
కరీంనగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పది సంవత్సరాలుగా దరఖాస్తులు చేసిన సమస్యలు పరిష్కారం కావడం లేదని చిగురుమామిడి మండలం, సుందరగిరి గ్రామ మాజీ సర్పంచ్ వంతడుపుల వెంకటస్వామి ప్రజావాణి జరిగే కలెక్టరేట్ ప్రాంతంలో డప్పుతో దండోరావేసి నిరసన వ్యక్తం చేశారు. వెంకటస్వామి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాకపోగా అధికారులు స్పందించకపోవడంతో విసిగి వేసారినామని అన్నాడు. జిల్లావ్యాప్తంగా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని మా గ్రామానికి సంబంధించిన సమస్యపై ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన అధికారులు సమస్య పరిష్కరించడం లేదన్నారు.
సుందరగిరి కి సంబంధించిన పలు రైతుల భూములను సంబంధం లేకుండా ధరణి పోర్టల్ ద్వారా ఇతరులకు బతిలాయించి సమస్యను సృష్టించిన అధికారులు దీన్ని సరిజేయమని అంటే కోర్టుకు వెళ్లాలి అనడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్యను సృష్టించింది అదికాదులు సరి చేయాల్సింది అధికారులు మధ్యలో బాధితులు కోర్టుకు వెళ్లడం, ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అనేకమంది రైతుల భూములను వేరొకరి పేరు మీద మార్చి , అధికారులు తప్పు చేశారని, భూములను, లావాని పట్టాలను సైతం ఇతరుల పేరుకు మార్చి రైతులకు ఇబ్బందులు కలగజేస్తున్నారని మండిపడ్డారు. అమ్మడానికి కొనడానికి లేని ప్రభుత్వ భూములను ఏ విధంగా ఇతరుల పైకి మార్చారో అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదు.
తప్పు చేసిన అధికారులకు ప్రమోషన్లు కల్పించి వేరొక చోటికి బదులాయించి చేతులు దులుపుకుంటున్న అధికారులు రైతుల కళ్ళలో కారం మట్టి కొట్టి ఆనంద పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఇతరులకు బదలాయించిన భూములను నిజమైన పట్టాదారులకు మార్పు చేయాలని కోరారు. సమస్యలు పట్టించుకోవడంలేదని దండోరా వేసి అదేకారులకు తెలిసే విధంగా ఈ ప్రయత్నం చేశానని బాధితుడు తెలిపారు.




