Karimnagar: నగర అభివృద్ధికి పార్టీలకతీతంగా నిధులు తెస్తాం.. మేయర్
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన బడ్జెట్‌కు పాలకవర్గం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
Karimnagar: నగర అభివృద్ధికి పార్టీలకతీతంగా నిధులు తెస్తాం.. మేయర్
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ బడ్జెట్, సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సమక్షంలో జరిగిన బడ్జెట్, సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర గీతం తో ప్రారంభమైన పాలకవర్గ సమావేశాలు దేశ జాతీయ గీతాలాపనతో ముగిసింది.
నగరపాలక సంస్థ 2026-2027 ఆర్థిక సంవత్సరం అంచనాలు, సవరించిన బడ్జెట్ పద్దుల ఆమోద నిమిత్తం 312.42 కోట్ల రూ. బడ్జెట్ కు, 11 ఎజెండా అంశాలకు పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. బడ్జెట్ లో నగరపాలక సంస్థ ఆదాయం నుండి పొరుగు సేవలు, ఉద్యోగ జీతాలు, పారిశుధ్య నిర్వహణ, రుణ వాయిదాల చెల్లింపులు, 10 శాతం నిధులను సోంత ఆదాయ వనరులు, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ కేంద్ర ఆర్థిక సంఘం నిధుల నుండి వనమహోత్సవం కు కేటాయించారు.
నగరపాలక సంస్థ నిధుల నుండి 1/3 నిధులను విలీన గ్రామాల డివిజన్ ప్రాంతాలు, అభివృద్ధి చెందని ప్రాంతాలు, బలహీన వర్గాల ప్రాంతాలు, మైనారిటీ, మురికి వాడ ప్రాంతాల మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. అంతేకాక మిగిలిన నగరపాలక సంస్థ నిధులను వివిధ వార్డుల అభివృద్ధి పనులకు కేటాయించారు. బడ్జెట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ గ్రాంట్ల వచ్చే ఆదాయం తో పాటు నగరపాలక సంస్థ ఆధాయం నుండి వచ్చే ఆధాయ వ్యయాల పై చర్చించి.
బడ్జెట్ అంచనాలు, సవరించిన బడ్జెట్ ఆమోదం తెలిపారు. సర్వసభ్య సమావేశం జీరో అవర్ లో పాలకవర్గ సభ్యులు డివిజన్ల వారిగా ప్రజలు ఎదుర్కుంటున్న పారిశుధ్యం, మంచి నీటి సరఫరా, లీకేజీలు, ఆస్తి పన్నుల వసూళ్లు వాటి హెచ్చు తగ్గులు, రోడ్లు, డ్రైనేజీలు, సిగ్నల్స్, ప్లాస్టిక్, వీది కుక్కలు, కోతుల స్వైర విహారం, ఎంక్రోజ్ మెంట్, భవన నిర్మాణ అనుతులు, పార్కుల నిర్వహణ, వీది దీపాల నిర్వహణ, స్మశాన వాటికల నిర్వహణ, వనమహోత్సవ నిర్వహణ లాంటి తదితర ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు.
డివిజన్ల వారిగా పాలకవర్గ సభ్యుల సమస్యల పై మేయర్, కమీషనర్ లు వివరణ ఇచ్చారు. అధికారుల పనితీరు పై పాలకవర్గ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ...పలువురి పనితీరు పై సభలో ప్రసంగించారు. పాలకవర్గ సభ్యులు లేవనెత్తిన ప్రతి సమస్య పై మేయర్ కొలగాని శ్రీనివాస్ వివరణ ఇస్తూ... దశల వారిగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామనిీ హామీ ఇచ్చారు.
అన్ని డివిజన్లో సమాంతరంగా అభివృద్ధి చేద్దాం..
మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మా పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. నగరపాలక సంస్థ అభివృద్ధి కొసం 312 కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టి పాలకవర్గ సభ్యుల సమక్షంలో ఆమోదం తెలిపామన్నారు. ప్రవేశ పెట్టిన బడ్జెట్ నగర ప్రజల ఆకాంక్షకు. అభివృద్ధి లక్యాలకు ప్రతి రూపమన్నారు. డివిజన్ల వారిగా సభ్యులు సభ దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి.
విలీన గ్రామాల డివిజన్ల తో పాటు అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. విలీన గ్రామాల డివిజన్ల తో పాటు శివారు ప్రాంతాల డివిజన్ల ను నగరంతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ఈ బడ్జెట్ లో పెద్దపీట వేశామని తెలిపారు. నగర అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని. పాలకవర్గ సభ్యుల, అధికారుల సభ్యుల సమన్వయం తో పని చేసి. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. కరీంనగర్ ను స్మార్ట్ క్లీన్ ఆండ్ గ్రీన్ సిటీగా మార్చే మహా యజ్ఞం లో పాలకవర్గ సభ్యుల కృషి ఎంతో అవసరమని తెలిపారు.
పార్టీలకతీతంగా నిధులు తెచ్చి అభివృద్ధికి కృషి చేస్తా..
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహాకారంతో కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులను తెచ్చేందుకు కృషి చేస్తామని. పార్టీలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా మా పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి బడ్జెట్, సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా జరిగిందని. నగర అభివృద్ధి కొసం పార్టీలకు అతీతంగా పాలకవర్గ సభ్యుల ప్రవేశ పెట్టెన బడ్జెట్, ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపారని. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




