Karimnagar: పన్ను వసూళ్ల జాతర.. మూడు రోజులే గడువు
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆస్తి పన్ను వసూళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Karimnagar: పన్ను వసూళ్ల జాతర.. మూడు రోజులే గడువు
కరీంనగర్: మూడు రోజుల్లో వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేసేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కళాభారతి లో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, సానిటేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది, వార్డు అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. 2025_2026 ఆర్థిక సంవత్సరం ముగింపుకు 3 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో వంద శాతం ఆస్తి పన్నుల వసూలు, మొండి బకాయి ధారుల పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
కమర్షియల్ ప్రాపర్టీ లు, కమర్షియల్ రెసిడెన్షియల్ రెండు కలిసి ఉన్న ప్రాపర్టీలు, రివిజన్ పిటిషన్లు, డబుల్ నెంబర్స్ ప్రాపర్టీలు, ఆర్ ఆర్ ఆక్ట్ తదితర అంశాలపై అధికారులు సిబ్బందితో కమీషనర్ సుదీర్ఘంగా చర్చించారు. అధికారులు, వార్డు ఆఫీసర్ల వారిగా కలెక్షన్ వివరాలతో పాటు ఫీల్డ్ లెవల్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్తి పన్నుల వసూలు పై పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిణ చర్యలు..
కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ. ఆస్తి పన్ను వసూళ్ళ లో అధికారులు, సిబ్బంది, వారెంట్ ఆఫీసర్లు, వార్డు ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిణ చర్యలు తప్పవన్నారు. విధి నిర్వహణ సక్రమంగా లేని అధికారులకు షోకాజు జారీ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిగిలిన మూడు రోజుల గడువు ప్రతి రోజు దాదాపు రెండున్నర కోట్ల టార్గెట్ గా ఆస్తి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. టాప్ 200 మొండి బకాయి దారులతో పాటు కమర్షియల్, మిక్సుడ్, డబుల్ నెంబర్ ప్రాపర్టీల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
వార్డు ఆఫీసర్లకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. కనీసం 95 శాతంకు తగ్గకుండా మీ టార్గెన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా ప్రభుత్వ ప్రాపర్టీల పన్నుల పై కూడ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మూడు రోజు ఉదయం 6 నుండి రాత్రి వరకు ప్రతి అసెస్మెంట్ ను విజిట్ చేసి. పన్నులు కట్టించేలా అధికారులు చర్యలు తీస్కోవాలన్నారు. మొండి బకాయి దారులు పన్నులు చెల్లించకుంటే చట్ట ప్రకారం ప్రాపర్టీలను సీజ్ చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా ప్రాపర్టి టాక్స్ చెల్లించని వారి నల్లా కనెక్షన్లు, పవర్ కనెక్షన్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
డబుల్ ఇంటి నెంబర్లు ఉన్న ప్రాపర్టీలకు సంబంధించి పాత ఇంటి నెంబర్ ఆస్తి పన్ను తో పాటు నూతనంగా ఇచ్చిన నెంబర్ పన్నులు కూడ కట్టించాలన్నారు. రివిజన్ పిటీషన్లు క్లీయర్ చేయాలన్నారు. ఆర్ ఆర్ ఆక్టును తప్పక అమలు చేయాలన్నారు. రెడ్ నోటీసుల గడువు ముగిన బకాయి దారుల పై చట్టపరమైన చర్యలు తీస్కోవాలన్నారు. మూడు రోజుల గడువు లోగా డిమాండ్ ప్రకారం పన్ను వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీలు ఖాధర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, ఆధికారులు పాల్గొన్నారు.




