Karimnagar: అంగన్వాడీల్లో కార్పొరేట్ వసతులు.. తనిఖీ చేసిన మేయర్!
Karimnagar: కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తీగలగుట్టపల్లి అంగన్వాడీ కేంద్రంలో సాక్ష్యం అంగన్వాడీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Karimnagar: అంగన్వాడీల్లో కార్పొరేట్ వసతులు.. తనిఖీ చేసిన మేయర్!
కరీంనగర్: అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీస్కోవడం జరుగుతుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. పోషణ అభియాన్ పథకం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపం నివారించుటకు కరీంనగర్ నగరంలోని తీగలగుట్ట పల్లి అంగన్వాడీ కేంద్రంలో సాక్ష్యం అంగన్ వాడీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సిడిపివో సభితతో కలిసి మంచి నీటీ ప్యూరీ ఫై, పోషణ వాటిక, బాల పేయింటింగ్, పిల్లల ఆట వస్తువులను ప్రారంభం చేశారు. అనంతం చిన్నారులతో ముఖాముఖిగా అప్యాయంగా మాట్లాడారు. పిల్లల విద్యాభ్యాసం, ఆటపటలు, అందిస్తున్న పౌష్టికాహారం, గర్బీణిలుకు బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అంగన్వాడీ నిర్వహాకులను అడిగి తెలుసుకున్నారు. పాలు, గుడ్లు, నాణ్యతను స్వయంగా పరిశీలించారు. పిల్లల హాజరు శాతం, బరువు ఎత్తు నమోదు రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు.
ఆరోగ్యకరమైన సమాజం తల్లులతోనే సాధ్యం..
అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలు శారీరకంగా , మానసికంగా ఎదగడానికి ఈ వయస్సు ఎంతో కీలకం అన్నారు. గర్భిణీ స్త్రీలతో పాటు, బాలింతలు చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించడం ద్వారా మాత్రమే ఆరోగ్య కరమైన భవిష్యత్తు తరాలను నిర్మించుకోగలమని అన్నారు.
ఒక నగరం లేదా ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే. ముందుగా అక్కడి తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నారు. అలాంటి బాధ్యతను తమ భుజాలపై వేసుకుని, ఒక తల్లిలా పిల్లలను సాకుతున్న అంగన్వాడీ సిబ్బంది సేవలు వెలకట్టలేమని అభినందించారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పోషక అభియాన్, సాక్ష్యం అంగన్ వాడీ కార్యక్రమాల ద్వారా ఒక వైపు పోషక విలువతో కూడిన పాలు, గుడ్లు, బాలామృతం, పప్పు, మరో వైపు మౌలిక సదుపాయాల కల్పన చేపడుతుందని తెలిపారు.
అంగన్వాడీల అభివృద్ధికి కేంద్రం నిధులు..
నగర వ్యాప్తంగా 35 అంగన్వాడీ కేంద్రాల్లో వసతి సౌకర్యాల కోసం ప్రభుత్వం ఒక్కో అంగన్వాడికి 35 లక్షల నిధులు విడుదల చేసిందన్నారు. అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లలు, గర్బిణీ స్త్రీల కోసం నీటి శుద్దీకరణ యంత్రం, మరియు పోషణ వాటిక, ఎల్ఈడీ టీవీలు, బాల పేయింటింగ్, ఆట వస్తువులు, మరుగు దొడ్లు తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో 269 అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను కూడ పిల్లల తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తూ... పిల్లలను తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని పిలుపు నిచ్చారు. అంగన్వాడీ కేంద్రంలో హాజరు శాతం పెరిగేలా సంబంధిత టీచర్లు, సీడిపివో అధికారులు సిబ్బంది చర్యలు తీస్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటుగా అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.




