Karimnagar: బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం.. ముందస్తు వేడుకల్లో పాల్గొన్న మేయర్

Karimnagar: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగర మేయర్ కొలగని శ్రీనివాస్ తన స్వగృహంపై పార్టీ జెండాను ఎగురవేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 8:34 PM IST
Karimnagar
X

Karimnagar: బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం.. ముందస్తు వేడుకల్లో పాల్గొన్న మేయర్

కరీంనగర్: ఏప్రిల్ 6 న 47వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ పార్టీ పీలుపు మేరకు ముందస్తు వేడుకల్లో భాగంగా ఆదివారం రోజున నగర మేయర్ కొలగని శ్రీనివాస్ తీగల గుట్టపల్లి లోని తన స్వగృహంపై పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కొలగని శ్రీనివాస్ మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6 న అటల్ బిహారీ వాజ్ పాయ్ నేతృత్వంలో స్థాపించబడిన భారతీయ జనతా పార్టీ నేడు వరల్డ్ లోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా ఆవిర్భవించిందన్నారు.

బిజెపి సిద్ధాంతం ,నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ నినాదమే బీజేపీ నీ తిరుగులేని శక్తిగా మార్చిందన్నారు. ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన బిజెపి ప్రస్థానం నేడు దేశాన్ని ఏలే స్థితికి వచ్చి, వరుసగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలు బిజెపి పట్ల దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వసాన్ని వమ్ము చేయకుండా ముందు కొనసాగుతుందన్నారు.

ముఖ్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జాతీయ భద్రతకు , దేశ అభివృద్ధి కోసం పెద్ద పీట వేసి ముందుకు కొనసాగుతుందన్నారు. ప్రధానంగామోడీ 2014లో వచ్చాక దేశంలో ప్రతీ రంగంలోనూ శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు కొనసాగుతున్నారని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story