Karimnagar: కరీంనగర్‌లో పీఎం జీవన్ జ్యోతి బీమా చెక్కు పంపిణీ

Karimnagar: కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 9:12 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో పీఎం జీవన్ జ్యోతి బీమా చెక్కు పంపిణీ

కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాలను ప్రజలు సద్వినియోగం చేస్కోవాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం రోజు గాయత్రి బ్యాంకు సేవింగ్ అకౌంట్ తో జీవన జ్యోతి భీమా యోజన ఇన్సూరెన్స్ ఖాతా దారుడి నామినీకి మేయర్ తన చేతుల మీదుగా బ్యాంకు ద్వారా అందించే 2 లక్షల నగదు చెక్కును అందజేసినారు.

కరీంనగర్ గాయత్రీ బ్యాంకు లో మడ్డి తిరుపతి అనే వ్యక్తి గతంలో ఖాతా ద్వారా ప్రధాన మంత్రి జీవన జ్యోతి పథకం కింద ఇన్సూరెన్స్ చేసుకోగా ఇటీవల మడ్డి తిరుపతి ప్రమాదవశాత్తు మరణించారు. దీంతో ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ద్వారా అందించే 2 లక్షల రూ. బీమా నగదును అతని భార్య నామినీ మడ్డి వనజకు మంజూరు చేసింది. అట్టి చెక్కును మేయర్ కొలగాని శ్రీనివాస్ తన చేతుల మీదుగా అతని భార్య వనజకు అందజేశారు. దీంతో నామిని వనజ మోడి ప్రభుత్వం తో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, బ్యాంకు సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేస్కోవాలని అన్నారు. ఏదైనా బ్యాంకు లో ఖాతాదారులై ఉండి చిన్న మొత్తం లో ప్రతి సంవత్సరం 436 రూ. డబ్బును ఇన్సూరెన్స్ రూపంలో చెల్లిస్తే. మీ కుటుంబానికి బరోసాగా ఉంటుందని తెలిపారు. ఈ పథకం కింద మీరు చెల్లించే డబ్బు ఆటో డెబిట్ విధానంలో మీ బ్యాంకు ఖాతా నుండి కట్ అవుతుందని.. ప్రతి ఒక్కరు ఈ పథకాలను సద్వినియోగం చేస్కోని మీ కుటుంబానికి బరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి. అశోక్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్, అనిల్ ఆపీసర్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story