Karimnagar: బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదు.. వాస్తవ రూపం ఉండాలి

Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 6:21 PM IST
Karimnagar
X

Karimnagar: బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదు.. వాస్తవ రూపం ఉండాలి

Karimnagar: సభా కార్యక్రమం మొదలు కాగానే లేచి నిల్చోని అధ్యక్ష మన సమావేశం జయ జయ తెలంగాణ గేయంతో మొదలుపెట్టి సమావేశం ముగించిన తర్వాత జనగణమ పాడాలని నా సూచన. చేయడం తో ప్రారంభమైంది

కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ బడ్జెట్ పై మాట్లాడుతూ..

కరీంనగర్ : తొలి పాలకవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మేయర్ కలగాని శ్రీనివాస్ కి కలెక్టర్కు కమిషనర్ కు నా తోటి కార్పొరేటర్లకు నమస్కారాలు అని ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈరోజు మొదటి సమావేశం బడ్జెట్ తోనే ప్రారంభం కావడం నేను శుభ సూచకంగా భావిస్తున్నాను. 312.46 కోట్లతో అంచనా బడ్జెట్ను రూపొందించిన అధికారులకు అభినందనలు తెలుపుతున్నాను.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మా ప్రజా పాలన ప్రభుత్వం మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి సంక్షేమ పథకాల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అయితే గత సంవత్సరం అంచనా బడ్జెట్ ఈ సంవత్సరం సవరించిన బడ్జెట్ను చూస్తే వాస్తవాలకు ఆమెడ దూరంలో ఉన్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ రూపంలో పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఊహించారు అవి ఊహించిన విధంగా నిధులు రాలేదు. ఆస్తి పన్నులు టౌన్ ప్లానింగ్ విభాగం సానిటేషన్ ఇతరత్రా విభాగాల నుంచి మున్సిపల్ జనరల్ ఫండ్ ఖాతాలో జమ కావలసిన నిధులు ఆమెరకు జమ చేయలేదు. అంచనా బడ్జెట్ కు వాస్తవ బడ్జెట్ కు మధ్య ఎంతో తేడా కనిపిస్తోంది

ఈ తేడాను గుర్తించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నైనా వాస్తవాలకు దగ్గరలో అంచనా బడ్జెట్ను రూపొందిస్తే బాగుండేది. కోట్ల భారీ బడ్జెట్ను చూపించిన అధికారులు ఆ మేరకు ఆదాయవ్యాలు వస్తాయా లేవా గుర్తించలేకపోయారు.

కరీంనగర్ కార్పొరేషన్ కు ఆదాయం సమకూర్చుకునే అనేక మార్గాలు ఉన్నప్పటికీ గత అంచనా బడ్జెట్ లో కొంత పెంచి అంకెల గారడి చేశారే తప్ప వాస్తవంగా వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదని తెలిపారు.

ప్రజలపై భారం వేయకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం పెంచండి..

ఉదాహరణకు అక్రమ కట్టడాలు అక్రమ లేఔట్లు అక్రమ హోల్డింగ్స్ వంటి వాటిని క్రమబద్ధీకరించే క్రమంలో ప్రస్తుతం పేర్కొన్న ఆదాయానికి రెట్టింపు నిధులు జనరల్ ఫండ్ లో జమ అయ్యే అవకాశం ఉంది ఆ దిశగా ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం

కరీంనగర్ నుండి టీఎన్జీవో షాపింగ్ కాంప్లెక్స్ టాక్స్ వసూలు చేయకపోవడం రెవిన్యూ క్లబ్ కాంప్లెక్స్ టాక్స్ వసూలు చేయకపోవడం కరెంట్ ఆఫీస్ కు సంబంధించిన వారి దగ్గర నుంచి టాక్స్ వసూలు చేయకపోవడం ఎక్సైజ్ క్లబ్ వాళ్ళది ట్యాక్స్ వసూలు చేయకపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయన్నారు. ఫంక్షన్ హాల్స్ హాస్పిటల్స్ బహుళ అంతస్తు భవనాలు నుండి నిబంధనల మేరకు ఆస్తి పన్నులు ఇతరత్రా పన్నులను వసూలు చేస్తే పన్నులు పెంచకుండానే ఆదాయం పెరుగుతుంది ఆ దిశగా ఆలోచన చేసి జనరల్ ఫండ్ ను మరింత పెంచాల్సిన అవసరం ఉంది

ప్రజలపై పన్నుల భారం మోపకుండా వచ్చే ఆదాయంపై దృష్టి సారించి సక్రమంగా పన్నులు వసూలు చేసి బాధ్యతగా విధులు నిర్వహిస్తే నగర ప్రజలు సంతోషిస్తారు ఆ దిశగా అధికారులు కృషి చేయాలి.

నగర అభివృద్ధి కోసం రాష్ట్ర నిధులు తేవడానికి కృషి చేస్తా..

రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కరీంనగర్ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి రాష్ట్ర మంత్రుల సహకారం తీసుకొని నగర అభివృద్ధికి నిధులు తీసుకురావడానికి తమ కాంగ్రెస్ కార్పొరేటర్ ను కృషి చేస్తాం అన్నారు.

అంచనా బడ్జెట్లో పేర్కొన్న విధంగా నిధులను సమకూర్చుకునేందుకు ఇప్పటినుండే ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలి బడ్జెట్ అంటే అంకెల అంకెల తారుమారు కాదని వాస్తవానికి దగ్గరలో ఉండే విధంగా చూడాలని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు.

బడ్జెట్లో కేంద్రమంత్రి నిధుల వరద కనిపించకపోవడం బాధేస్తుంది..

ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఒక్కసారి బిజెపికే అవకాశం ఇవ్వండి నిధులను వరదల తీసుకువచ్చి విలీన డివిజన్లతో పాటు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలుపుతామని చెప్పినట్లుగా నిధులు తీసుకురావాలని నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను..

కరీంనగర్ పట్టణంలో కుక్కల భారి నుండి ప్రజలను రక్షించాలని ఈ కుక్కల సమస్యను తీర్చాలని అదేవిధంగా నగరంలోని అనేక డివిజన్లో లైట్లు వెలగడం లేదని డివిజన్లో కార్మికులు తక్కువ ఉన్నారని శానిటేషన్ వ్యవస్థ బాగుపరచాలని, ఇంకా పరిశుద్ధ పనులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. మంచినీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ కూడా మెరుగుపడాలి. వేసవికాల దృశ్య నీటి సమస్య ఇబ్బందు లేకుండా చూడాలన్నారు.

విలీన డివిజన్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన నిధులను కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ఆయా డివిజన్లో జరుగుతున్న అక్రమ కట్టడాలు అక్రమ లేవట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story