Indiramma Housing scheme: ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి

Indiramma Housing scheme: కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 28 March 2026 6:59 PM IST
Karimnagar
X

Karimnagar: ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి

కరీంనగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ప్రారంభించిన ఇండ్లను పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధమయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారులు తుమ్మనవేణ రజిత, కుంటు రాధతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి ఇప్పటివరకు అయిన ఖర్చు, ప్రభుత్వం నుండి వచ్చిన బిల్లులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకొని పూర్తి లబ్ధి పొందాలని సూచించారు.

లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలి..

జిల్లా కలెక్టర్ హౌసింగ్, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అన్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే పరిష్కరించాలని అన్నారు. ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని ఎంపీడీవోను ఆదేశించారు. మోడల్ గ్రామాలు, మొదటి మొదటి దఫాలో ఎంపికైన లబ్ధిదారుల ఇండ్లు నూరు శాతం పూర్తయ్యేలా చూడాలని అన్నారు.

కలెక్టర్ వెంట గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు సంచాలకులు శ్రీనివాస్, డి.ఈ వెంకటరమణ, ఏ.ఈ శ్రీజ, ఎంపీడీవో మల్హోత్రా, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story